కోరుట్ల

ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాల దినోత్సవం

viswatelangana.com

March 28th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ప్రతి నెలలో నాలుగో శుక్రవారం రోజును పురస్కరించుకొని ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొరకు బస్టాండ్ లో ఫ్యాన్లను, కుర్చీలను, టాయిలెట్లను, త్రాగునీరును, అలాగే బస్టాండ్ పరిసరాలను పరిశీలించడం జరిగింది. అలాగే ప్రయాణికులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆఫీస్ డిప్యూటీ సూపర్డెంట్ గంగారం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ సాగర్ పాల్గొన్నారు.

Related Articles

Back to top button