కథలాపూర్
బోరు బావి పనులు ప్రారంభం

viswatelangana.com
March 28th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ 1.20 లక్షలు నిధులను కథలాపూర్ మండల్ తాండ్రియాల గ్రామానికి బోరు బావి కొరకు కేటాయించగా హనుమాన్ గుడి వద్ద ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మల్యాల మారుతి, హనుమాన్ గుడి ఛైర్మెన్ అందే రమేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు, పిడుగు ఆనంద్ రెడ్డి, నరెడ్ల రవి,జెలందర్, అంజయ్య, ప్రవీణ్, సునీల్, శ్రీను, సురేష్, సాయి, గంగామల్లయ్య, చిన్నరెడ్డి, చారి, మహేందర్, ప్రసాద్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



