కోరుట్ల
కోరుట్ల వాసికి హైద్రాబాద్ లో సన్మానం

viswatelangana.com
April 1st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణానికి చెందిన కళాకారుడు, కోరుట్ల బ్రహ్మణ సేవాపరిషత్ ప్రధానకార్యదర్శి కలకుంట్ల నితిన్ కుమార్ ఆచార్యను హైద్రాబాద్ లో జాతీయ సాహిత్య పరిషత్ నిర్వహణలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో సన్మానించారు. నితిన్ కుమార్ రాసిన కవితను కవితసంకలనం పుస్తకంలో జాతీయ సాహిత్యపరిషత్ వారు ప్రచురించారు. తనకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ తాను రాసిన కవితని నితిన్ కుమార్ విచ్చేసిన అతిథుల ముందు చదివి వినిపించగా జ్ఞాపిక, శాలువా, గ్రంథాలతో సత్కరించి, అభినందించారు. భవిష్యత్ లో కూడా ఇలాంటి సమాజచైతన్య కవితలు రాయలని నితిన్ కుమార్ ను విచ్చేసిన వక్తలు, కార్యక్రమ నిర్వాహకులు ప్రోత్సహించారు.



