ఏప్రిల్ 30 లోపు ఇంటి పన్ను చెల్లించి రాయితీ పొందాలి

viswatelangana.com
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 30వరకు ఇంటి పన్ను చెల్లింపు చేసేవారికి ఐదు శాతం రాయితీని ప్రభుత్వం కల్పించినదని రాయికల్ మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్ తెలిపారు. రాయికల్ పట్టణంలోని ప్రజలు ఇంటి పన్ను సకాలంలో చెల్లించి రాయితీ అవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు.మున్సిపాలీటీ అభివృద్ధికి పన్ను చెల్లింపు దారులు సహకరించాలని గురువారం మున్సిపల్ సిబ్బంది ఇంటింటా తిరుగుతూ ఇంటిపన్ను వసూలు కార్యక్రమం ప్రారంభించారు.ఇందులో భాగంగా నాగారం వీధిలో ఇంటి పన్ను చెల్లింపు చేసిన చెరుకు పల్లవికి పన్ను చెల్లింపు రశీదును అందజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాయికల్ పట్టణంలో ముందుగా పన్ను చెల్లింపు చేసిన చెరుకు పల్లవి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటి,ఆర్ఐ అశోక్,బిల్ కలెక్టర్లు మందుల ప్రసాద్, దుబ్బ రాజ్ కుమార్ బి.నరేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



