రేషన్ బియ్యం- 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశానికి ఎలాంటి సంకేతం?

viswatelangana.com
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ, ఇప్పటికీ లక్షలాది మంది పేదలు తమ ప్రాథమిక ఆహారం కోసం రేషన్ బియ్యంపై ఆధారపడుతున్న దురదృష్టకరమైన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇది దేశ అభివృద్ధికి అద్దం పట్టే అంశంగా మారింది. రేషన్ బియ్యం ఇస్తున్నారంటే.. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో తినడానికి తిండి లేకపోవడమే!” అని యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి పేరుతో భారీ ప్రాజెక్టులు, పథకాలు అమలు చేస్తున్నా, ప్రాథమిక అవసరాలైనా తీర్చలేకపోవడం ప్రభుత్వాల వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆయన అన్నారు.ప్రతీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేదల కోసం పెద్ద పెద్ద హామీలు ఇస్తుంది. కానీ, వాస్తవానికి తగిన స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, సరైన ఆహారం అందని పరిస్థితి కొనసాగడం అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భారత దేశం సాంకేతికంగా ఎంత ముందుకెళ్లినా, పేదరికం ఇంకా సమూలంగా తొలగించలేకపోవడం ఆందోళన కలిగించే విషయమనిప్రజల జీవితాలలో నిజమైన మార్పు రావాలంటే, రేషన్ బియ్యం పథకాలను ఇచ్చి మౌనంగా ఉండటానికి బదులుగా, ప్రభుత్వాలు ఆహార భద్రతకు మించిన స్థాయిలో ఆర్థిక స్వావలంబన కల్పించే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మొహమ్మద్ ముజాహిద్ సూచించారు.



