రాయికల్

గోమాతలను దొంగలించిన వారిపైచర్యలు తీసుకోవాలి

viswatelangana.com

April 8th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శివాలయం మరియు లలితాంబ ఆలయంలో ఐదు గోమాత లను గత కొన్ని రోజుల క్రితం గుర్తుతెలియని వారు ఎత్తుకెల్లాగా సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లిన. ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన భక్తులు జంతు ప్రేమికులు శివాజీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. దొంగచాటున ఆవులను తీసుకెళ్లి కళేబరాలను తరలిస్తున్నారని అనుమాన వ్యక్తం చేశారు. అవును గోమాతగా పూజిస్తామని అన్యాయంగా దొంగలించిన వ్యక్తులను గుర్తించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎనగందుల రమేష్, సురతాని భాగ్యలక్ష్మి, సురేందర్, బన్న సంజీవ్, శ్రీకాంత్ రెడ్డి మాచర్ల మారుతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button