రాయికల్
పోషణ పక్షోత్సవాలు

viswatelangana.com
April 10th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో న్యూ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షోత్సవాల భాగంగా గర్భిణీలు బాలింతలకు 0-6 సంవత్సరాల పిల్లల తల్లులకు హ్యాండ్ వాష్ గురించి, గర్భిణీ బాలింతలకు కిశోర బాలికలకు రక్తహీనత గురించి అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ ఎద్దండి అనురాధ మాట్లాడుతూ మనలో రక్త హీనత ఏర్పడితే మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల మరియు రక్తహీనత సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని, ఎక్కువగా ఐరన్ కాలుష్యం మిల్లెట్స్ లాంటి పదార్థాలను తీసుకోవాలని ఆమె సలహాలు సూచనలు చెప్పారు. అనంతరం గర్భిణీ బాలింతలతో మరియు తల్లులతో కూడా పోషణ ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఆయా గుండా లావణ్య గర్భవతులు బాలింతలు 0-6 సంవత్సరాల పిల్లల తల్లులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.



