రాయికల్
ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని వినతి

viswatelangana.com
April 12th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపేట్ గ్రామంలో గల శ్రీరామ ఆలయంలో కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సి ఎల్.రమణ, జిల్లా బిజెపి పార్టీ ఇంచార్జ్ భోగ శ్రావణి లకు గ్రామస్థులు వినతిపత్రం అందజేసారు. వారు సానుకూలంగా స్పందించడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోలరాజు, మాజీ ఎంపీటీసీలు బొమ్మకంటి మురళీధర్, అన్నపురం సత్యం గౌడ్, బెజ్జంకి మోహన్, ఆకుల మహేష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



