కోరుట్ల

అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

April 14th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలతో పాటు పలు గ్రామాలలో, మండల కేంద్రాలలో జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేశపూర్ గ్రామంలో జరిగిన డాక్టర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అదేవిదంగా కోరుట్ల పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మెట్ పల్లి పట్టణంలోనూ జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెట్ పల్లి మండలం వెల్లుల్ల లో జరిగిన అంబేద్కర్ జయంతి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షలు పన్నాల అంజిరెడ్డి, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బోరిగం రాజు, ఏల్లలా వెంకటరెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేశం గౌడ్, కోరుట్ల, మెట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, తిప్పిరెడ్డి అంజిరెడ్డి, కోరుట్ల, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్, కోరుట్ల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మచ్చ కవిత నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి నేమూరి భూమయ్య, జట్టి లింగం, దేవేందర్, బుస రాజేశ్వర్, రమేష్, రామరాజు పురుషోత్తం, శేఖ్ మహ్మ్మద్, పూదరి నర్సాగౌడ్, ఎండి రైసోద్దీన్, పూదరి రాము, సురేష్, కొంతం నవీన్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button