కోరుట్ల

యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు ఘన సన్మానం

viswatelangana.com

April 16th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, బాధ్యతలు చేపట్టిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌ మారుతి ప్రసాద్ కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్ కమిషనర్‌కు శాలువా కప్పి సన్మానించి, పట్టణ అభివృద్ధిపై అభినందనలు తెలిపారు. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ, కోరుట్ల పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అధికారులు చురుకుగా పనిచేయాలని ప్రజల ఆశాభావం ఉంది. ప్రజల సమస్యలపై ప్రభుత్వం వేగంగా స్పందించి, వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి, అని పేర్కొన్నారు. అదేవిధంగా, మారుతి ప్రసాద్ కమిషనర్ మాట్లాడుతూ, కోరుట్ల పట్టణ అభివృద్ధికి అన్ని దశల్లో కృషి చేస్తాను. ప్రజలకు అవసరమైన పౌరసదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతాను, అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం పి జె అద్యక్షులు మొహమ్మద్ నసీర్. మీనా మస్జిద్ అధ్యక్షులు అబ్దుల్ భారీ. అద్నాన్ షకీల్. అబ్ధుల్ ఖయూం. ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button