ఎస్సీల సంక్షేమ పథకాలు గాలికి వదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

viswatelangana.com
ఎస్సీల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో పథకాలను ప్రవేశపెట్టడమే గాని క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా అందడం లేదని, టిఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వన తడుపుల అంజయ్య ఆక్షేపించారు. ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్కార్ ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీలలో ఉన్న మూడు కేటగిరీలలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి 12 లక్షల రూపాయలను పంపిణీ చేస్తుందని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటివరకు దాని ఉసే ఎత్తడం లేదని ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ప్రత్యేకమైన రివ్యూ ఏర్పాటు చేసి ఇప్పటికైనా ఎస్సీ సబ్ ప్లాన్ యొక్క పూర్తి వివరాలను పత్రికా ముఖంగా తెలియజేయవలసిన అవసరం ఉందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి జయంతోత్సవాలని ఘనంగా జరపడమే కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ఎస్సీల సంక్షేమం కోసం ఏదైనా కొత్త పథకం ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదని. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మీద కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులైన పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివలసిన అవసరం ఉందని అంజయ్య అన్నారు.



