రాయికల్

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

viswatelangana.com

April 23rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం ముగింపు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూకేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. యూకేజీ విద్యార్థులు వారి మాటలతో అందరి మనసులను గెలిచాయి. ఈ సందర్భంగా ప్రగతి పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ, “చిన్నారుల్లో ప్రతిభకు మెరుగైన వేదికను అందించేందుకు మా పాఠశాల ఎల్లప్పుడూ కృషి చేస్తుందని. విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడారంగాలలో విద్యార్థులు పాల్గొనడం ఎంతో ముఖ్యమని మేము నమ్ముతాం,” అని అన్నారు. ఈ వేడుకలో పాఠశాల ప్రిన్సిపాల్ జయశ్రీ శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలబాలికల ప్రతిభను ప్రశంసించారు. చివరగా పాఠశాల తరఫున ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేసారు.

Related Articles

Back to top button