రాయికల్
కరపత్రం ఆవిష్కరణ

viswatelangana.com
April 23rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ప్రాథమిక పాఠశాల ముందస్తు బడిబాట కరపత్రమును జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము ఆవిష్కరించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోని చేర్పించి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని అన్నారు.యం ఎస్ బడి డాట్ కం వారు మైతాపూర్ ప్రాథమిక పాఠశాలకు1000 ప్రతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ ఆఫీసర్ రాజేష్, అనుపమ, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు జ్యోతి, మహేష్, జయంత్ కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.



