కోరుట్ల

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిపై కోరుట్లలో జనసేన పార్టీ తీవ్ర నిరసన

viswatelangana.com

April 23rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద హిందూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కోరుట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు దుర్మార్గంగా హత్య చేయబడిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, కోరుట్ల పట్టణంలో జనసైనికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు వొడ్నాల రామారావు మాట్లాడుతూ, “ఇలాంటి కిరాతకమైన దాడులు మానవత్వాన్ని కలచివేస్తున్నాయి. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండించడానికి మాటలు చాలవు. జనసేన పార్టీ తరఫున మృతులకు నివాళులు అర్పిస్తున్నాం. రాష్ట్ర అధినాయకత్వం ఆదేశాల మేరకు వరుసగా మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని అన్నారు, అలాగే ఈ రోజు సాయంత్రం క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించబోతున్నాం” అని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు సాయికృష్ణ, విజయ్, అనిల్, శశి, సురేష్, కరుణాకర్, ప్రశాంత్, జగదీశ్, సంపత్, అరవింద్, రిష్వంత్, వెంకటేష్, సాగర్, వికాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button