రాయికల్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

viswatelangana.com
May 2nd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జన గణన తో పాటు బీసీల కుల గణన ఆర్డినెన్సును కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రాయికల్ మండల మరియు పట్టణ శాఖ నాయకులు.ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా అధ్యక్షులు తోపారపు ఆశన్న మాట్లాడుతూ భారత దేశంలో జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టడం ప్రజానీకానికి ఎంతో హర్షనీయమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓబీసీలకు ఉన్నత అవకాశాలు అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



