మెట్ పల్లి
బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థుల ప్రభంజనం

viswatelangana.com
May 4th, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
పదవ తరగతి ఫలితాలలో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ఇ/మీ విద్యార్థిని, విద్యార్థులు సత్తా చాటారు. మొదటి స్థానంలో జి.వర్షిత్ 568 మార్కులు, రెండవస్థానంలో సఫా మిస్కిన్ 563 మార్కులు, తృతీయ స్థానంలో టి.హర్షిత్ 527 మార్కులు, నాల్గవ స్థానంలో రాదీఫ్ 525 మరియు టి.హర్షిత 525 మార్కులతో తమ ప్రతిభను కనబరచారు. 11 మందికి పైగా విద్యార్ధిని విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించారు.నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని బ్రిలియంట్ గ్రామర్ గ్రూప్ ఆఫ్ స్కూల్సి చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి (ఎమ్మెల్యే కల్వకుర్తి), డైరెక్టర్ జె. వి.డి ప్రసాదరావు, ప్రిన్సిపల్ ఎన్ ప్రశాంత్ గౌడ్ మరియు అధ్యాపక బృందం తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.



