అంగన్వాడీ కేంద్రాలలో టి హెచ్ ఆర్ పంపిణీ

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల సెక్టార్ లోని చింతలూరు, బోర్నపల్లి గ్రామాలలో బుధవారం రోజున ఐ సి డి ఎస్ జగిత్యాల్ సిడిపిఓ మమత ఆధ్వర్యంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున అంగన్వాడి కేంద్రాలకు సెలవుల వచ్చినందున గర్భిణీలకు బాలింతలకు మరియు ప్రీస్కూల్ పిల్లలకి మరియు ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలందరికీ టి హెచ్ ఆర్ అనగా టేక్ హోమ్ రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం తెలియపరచినందున అందులో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు మరియు ప్రతిరోజు ఫ్రీ స్కూల్ కు వచ్చే పిల్లలకు బియ్యం పప్పు నూనె మరియు ఎగ్స్ పొడి రేషన్ గా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోని, ప్రతినిత్యం వాడాలని ఎండలలో బయటకి తిరగకుండా ఉండాలని, అత్యవసర వేళల్లో బయటకి వచ్చిన అవసరం ఉన్నట్టయితే ఓ ఆర్ ఎస్ వెంట తీసుకువెళ్లాలని తెలియపరచినారు మరియు అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలను మరియు పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు బరువులు పొడవులు చూడాలని వారు వయసుకు సరిపడా బరువు లేనిచో గృహ సందర్శన ద్వారా తగు కౌన్సిలింగ్ ఇస్తూ మరియు అతి తక్కువ బరువులో ఉన్న పిల్లలకి ఆకలి పరీక్ష పెట్టాలని అందులో పాస్ అయితే బాలామృతం ప్లస్ ఇవ్వాలని మరియు ఆస్పత్రికి రిఫరెన్స్ పంపాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సువర్ణ, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు ప్రీస్కూల్ పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.



