జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాల బాలికల ఛాంపియన్ షిప్

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం వివేకవర్ధిని హై స్కూల్ మైదానం లో 4వ జగిత్యాల జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల ఛాంపియన్ షిప్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాయికల్ మండల తహసీల్దార్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యుం, మున్సిపల్ కమిషనర్ కోడేటి మనోహర్ వివేకవర్ధిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కైరం సత్యం విద్యార్థులకు శుభాశీస్సులు తెలిపారు. ఎమ్మార్వో మరియు మున్సిపాల్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు ఆటలతో పాటుగా చదువులో కూడ ముందుండాలని సూచించారు. ఇంతటి వేసవి సమయంలో కూడ క్రీడలపై మక్కువ తో ఇందులో పాల్గొంటున్న మిమ్ముల్ని చూస్తే రాబోయే కాలంలో మీరంతా రాష్ట్ర,దేశం తరుపున పాల్గొని పతకాలు సాధించాలని ఆకాoక్షించారు. ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయం సాధించిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జి గౌతమ్, సౌమ్య రెడ్డి, మల్లీశ్వరి, నవీన్, భీమేష్, యశ్వంత్, సుమంత్, సురేందర్, అక్షయ్, సాయి, క్రీడాకారులు మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



