మెట్ పల్లి
జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ ని ఘనంగా సన్మానించిన మెట్ పల్లి యాదవ సంఘ సభ్యులు

viswatelangana.com
May 8th, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
యాదవ సంఘం అడహాక్ కమిటీని ఏర్పాటు చేసి జగిత్యాల జిల్లాలో అన్ని గ్రామాలు పర్యటిస్తూ యాదవ సంఘ సమావేశాలు నిర్వహిస్తూ, సభ్యత్వాలు చేస్తూ యాదవులను ఒక్కటి చేస్తూ, ప్రమాదవశాత్తు మరణించిన నిరుపేద యాదవ కుటుంబాలను ఆదుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్న యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ ని పూలమాల వేసి సాలువతో సత్కరించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపిన మెట్ పల్లి పట్టణ యాదవ సంఘ సభ్యులు.. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రోళ్ల హన్మాండ్లు యాదవ్, గోపన వేని గంగాధర్ యాదవ్, జెల్ల బాలరాజు యాదవ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు..



