కోరుట్ల

ఎంపీ అర్వింద్ చొరవతో నవోదయ విద్యాలయ అడ్మిషన్స్ ప్రారంభం

viswatelangana.com

May 29th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాల్లో రెండు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభించాలని నవోదయ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా విద్యాలయాల శాశ్వత మరియు తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లేఖ రాశారు. జగిత్యాల జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి కోరుట్ల మండలం శివారులో గల సర్వేనెంబర్ 923లో మరియు తాత్కాలిక వసతి కొరకు కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలో గల బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కాలేజ్ మరియు సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ఎంపిక చేయబడ్డాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి వివాదాలు లేని కోరుట్ల శివారులోని 30 ఎకరాల భూమి నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయింపు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా శాశ్వత మరియు తాత్కాలిక భవనాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ మరియు టెలికమ్యూనికేషన్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యా సంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయ చొప్పదండి (కరీంనగర్) ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. కాగా నవోదయ విద్యాసంస్థను మంజూరు చేయడంతో పాటు ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమయ్యేలా ఎంపీ అరవింద్ చొరవ తీసుకోవడం వల్ల, నవోదయ విద్యాలయ అడ్మిషన్స్ రేపటి నుండి మే 30 న ప్రారంభం కాబోతున్నా సందర్భంగా బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ అధ్యక్షులు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో నవోదయ పాఠశాల కోరుట్లలో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి మరియు ఇందురు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి చిత్రపటానికి బిజెపి నాయకులు పాలాభిషేకం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, జిల్లా పదాధికారి వడ్డేపల్లి శ్రీనివాసన్, తిరుమల వాసు, కస్తూరి లక్ష్మి నారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇట్యల నవీన్ కుమార్, చెట్లపెల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్, వల్లాజీ నాగేష్, మాజీ కాన్సిలర్లు మాడవేణి నరేష్, పెండెం గణేష్, సీనియర్ నాయకులు చిరుమల్ల ధనుంజయ్, తునికి భాస్కర్, జక్కుల జగదీశ్వర్, పోతుగంటి శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణరెడ్డి, దళిత మోర్చ అధ్యక్షులు బెక్కం అశోక్, బూత్ అధ్యక్షులు తోట దుర్గ ప్రసాద్, తాహిర్, తోట రాజేశం, గజ్జి రంజిత్, బీజేవైఎమ్ నాయకులు కలల సాయి చందు, దమ్మ సంతోష్, లోకేష్, ప్రశాంత్, అజయ్, పట్టణ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్చార్జిలు, బీజేపీ మరియు బీజేవైఎమ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button