కోరుట్ల

లయన్స్ క్లబ్ మరియు కోటి నవదుర్గ కోరుట్ల ఆధ్వర్యంలోఉచిత అల్పాహార కార్యక్రమం

viswatelangana.com

February 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

లయన్స్ ఇంటర్నేషనల్ డీస్ట్రిక్ 320G వారు నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరట్ల మరియూ కోటి నవ దుర్గ వారి అధ్వర్యంలో ఉచిత అల్పాహారం ఈ రోజు ఉదయం 8:35 ని లకు , కోరుట్ల లోని సివిల్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా క్లబ్ తరపున ప్రతీ రోజు సుమారు 150 మంది కి హాస్పిటల్ ఆవరణలో ఉచిత అల్పాహారం అందివ్వడం జరుగుతోంది. ఈ సంధర్భంగా క్లబ్ అధ్యక్షులు లయన్ వనపర్తి చంద్ర మోహన్ మాట్లడుతూ రోజూ ఉచిత అల్పాహారం అందివ్వడం వల్ల ఆసుపత్రికి వచ్చే వారు, అందులో అడ్మిట్ అయినవారు, వారి వెంట ఉండే వారు అందరికి ఉపయోగం కలుగుతుందని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా హంగర్ రిలీఫ్ కోర్ టీమ్ మెంబర్ లయన్ ఉషా కిరణ్ ఎలిమిళ్ల మాట్లడుతూ ప్రస్తుతం రోజూ ఉదయం అల్పాహారం అందిస్తూ భవిష్యత్తు లో మధ్యాహ్నాం భోజనం కూడా అందించే ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు జరిగిన అల్పాహార వితరణ కు లయన్ గుంటుక చంద్ర ప్రకాష్ – కవిత దంపతులు వారి పెళ్ళిరోజు పురస్కరించుకొని ఆర్థిక సహాకారం అందివ్వడం జరిగింది. ప్రతి రోజూ కూడా ఎవరైనా దాతలు వారి వారి పుట్టినరోజు కానీ, పెళ్ళి రోజు కానీ ఏదైనా ఇతరత్రా సందర్భాన్ని పురస్కరించుకొని ఇట్టి కార్యక్రమంలో తమ వంతు ఆర్థిక సహాకారం అందించి ఇట్టి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వనపర్తి చంద్ర మోహన్, కుందారపు మహేందర్ కోరడం జరిగింది. ఈ నాటి ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సుపెరెండెంట్ డాక్టర్ వేముల సునీత మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఉచిత అల్పాహార కార్యక్రమం కూడా దూరం నుండి ఆసుపత్రికి వచ్చే వారికి ఇక్కడ అడ్మిట్ అయినవారికి చాలా ఉపయోగ కరంగా ఉంటుందని , భవిష్యత్ లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో క్లబ్ సీనియర్ నాయకులు గుంటుక చంద్ర ప్రకాష్, అల్లాడి ప్రవీణ్, చాప కిషోర్, ఎలిమిల్ల ఉషా కిరణ్, పోతని ప్రవీణ్ కుమార్, జోన్ ఛైర్మెన్ అల్లాడి శోభ, మహిళా క్లబ్ సెక్రెటరీ కుందారపు ప్రేమలత, కటుకం శంకర్, ఎలిమిళ్ల రామ్ నారాయణ, కనపర్తి శ్రీనివాస్, జక్కని ధనుంజయ మరియూ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button