కోరుట్ల

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జువ్వాడి నర్సింగరావు

viswatelangana.com

June 12th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ రాష్ట్ర కొత్త మంత్రులైన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి లను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు గురువారం హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని వారి నివాసాల్లో ఒక్కొక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, వారి కొత్త బాధ్యతలపై అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో జువ్వాడి నర్సింగరావుతో పాటు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మరియు పార్టీకి చెందిన మరికొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button