కథలాపూర్
ఎంపిపిఎస్ పోతారం లో యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు పాఠ్య పుస్తకాల పంపిణి

viswatelangana.com
June 13th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
ఎంపిపిఎస్ పోతారం లో మాజీ ఎంపీటీసీ కథలాపూర్ మండల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పులి శిరీష- హరిప్రసాద్ ఏకరూప దుస్తులు మరియు పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభం చేశారు.పిల్లల నమోదు పెరిగినందున పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు, పిల్లలు పాఠశాల లో నాణ్యమైన విద్యను అందుకోవాలని, ప్రభుత్వం వారికోసం అందించే వనరులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏఏపిసి చైర్మన్ లావణ్య, హెచ్ ఎం శ్రీనివాస్ ఉపాధ్యాయులు రాజ్ కుమార్ కిష్టయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.



