మేడిపల్లి

పరీక్ష సమయాల్లో విద్యార్థులకు సూచనలు తెలిపిన డాక్టర్లు..

viswatelangana.com

February 16th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కట్లకుంట లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఒత్తిడి గురి కాకుండా డాక్టర్. శ్రీనివాస్ ఎండి & హెచ్ ఓ జగిత్యాల , డాక్టర్. ప్రవీణ్ చంద్ర మెడికల్ ఆఫీసర్ మేడిపల్లి విద్యార్థులు మంచి ప్రణాళిక తయారు చేసుకోవాలని, పోషకాహారం తీసుకోవాలని, చదువుతున్నపుడు విరామం ఇస్తూ చదవాలని,ఎక్కువ సార్లు రివిసన్ చేయాలని, అయినప్పటికీ ఒత్తిడి గురైతే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలని, మాకు కూడా ఫోన్ చేస్తే మేము కూడా వచ్చి సహకారం అందిస్తామని చెపుతూ…. జీవితం చాలా విలువైనది ఇలాంటి పరీక్షలు మనం జీవితంలో ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుందని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులందరికీ బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలొ ప్రధానోపాధ్యాయులు హనుమాన్ సాగర్ , ఉపాధ్యాయులు, దేవానంద్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మేడిపల్లి , భారత లక్ష్మి పి హెచ్ ఎన్ , పద్మాలత సూపర్వయిజర్, విజయ ఎల్టి, యేసుమని ఏఎన్ఎం, తిరుపతి రెడ్డి హెచ్ ఏ , మండలం లోని అందరు ఆశా వర్కర్లు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

Related Articles

Back to top button