కోరుట్ల

కోరుట్ల పురపాలక సంఘంలో పారిశుద్ధ కార్మికులకు స్వయం సహాయక సంఘం మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం

viswatelangana.com

June 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు అలాగే స్వయం సహాయక సంఘం మహిళలకు కోరుట్ల మున్సిపాలిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంపు నిర్వహించిన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కి డిఎం&హెచ్ఓ అలాగే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అంతేకాకుండా పారిశుద్ధ విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఈ హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. పట్టణ పారిశుద్ధ్యంలో పారిశుద్ధ కార్మికులు చేసే సేవలు మరువరానివి వీరు పారిశుధ్య విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ వారి సేవలను గుర్తించి వారిని గౌరవించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, అశోక్, మున్సిపల్ సిబ్బంది, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది అలాగే పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button