మెట్ పల్లి
రక్తదాత అనిల్ రెడ్డికి సన్మానం

viswatelangana.com
June 14th, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సేవా భారతి ట్రస్ట్ ను స్థాపించి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ ప్రమాదాలు జరిగినప్పుడు మరియు డెలివరీ ఆపరేషన్ సమయంలో వారికి రక్త దాతల ద్వారా అందించడం మరియు రక్త దానాలు ఇచ్చే విధంగా యువతను ప్రోత్సహించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమాజ సేవకుడు కోడిపెల్లి అనిల్ రెడ్డి ని మెట్ పల్లికి చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో మరియు జగిత్యాల జిల్లా బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి మెమోంటోను మరియు ప్రశంసా పత్రాన్ని అందించడం జరిగినది.



