కోరుట్ల

ప్లాస్టిక్ వాడితే చట్టపరంగా చర్యలు

viswatelangana.com

June 14th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల కార్యక్రమంలో భాగంగా కోరుట్ల మున్సిపల్ కమీషనర్ ఎ.మారుతి ప్రసాద్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని కిరాణా షాపులు, బేకరీలు అలాగే టిఫిన్ సెంటర్లలో నిల్వ ఉంచిన పదార్థాలు అలాగే నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై పుర అధికారులు శనివారం తనిఖీ చేపట్టారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్న రెస్టారెంట్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లలో అకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగల్ యూస్ ప్లాస్టిక్, నిలువ ఉంచిన పదార్థాలు ను స్వాధీనం పరుచుకొని సుమారుగా 8 వేల 5 వందల రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు బట్ట సంచులు వాడాలని తెలిపారు. దీనిని ఉదేశించి మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేదించాలి లేనియెడల భారీ జరిమానాలు విధించడంతో పాటు దుకాణాలు సీజ్ చేయడం జరుగుతుంది, అలాగే ట్రేడ్ లైసెన్స్ లేని వారు వెంటనే తీసుకోవాలి అని ఆయన తెలపడం జరిగింది. వ్యాపార కార్యకలాపాలతో వెలువడిన చెత్తను తడి, పొడి, హానికరక చెత్తగా వేరు చేసి షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని తెలిపారు. లేనిచో ఎస్డబ్ల్యుఎం-2019 చట్టం ప్రకారం జరిమానా విధించబడును. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్ అలాగే బాలే అశోక్ లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జి.మహేష్, మున్సిపల్ సిబ్బంది, హేమంత్ అలాగే జవాన్లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button