కోరుట్ల

లోతట్టు ప్రాంతాలను గుంతలను పూడ్చే పనులు వేగవంతం చేసిన కోరుట్ల మున్సిపాలిటీ

viswatelangana.com

June 17th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై ఏర్పడిన గుంతలను గుర్తించి వాటిని భవన నిర్మాణ వ్యర్థాలతో పూడ్చే కార్యక్రమం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతోంది. 100 రోజుల ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా ఈ చర్యలు చేపట్టబడినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తెలిపారు. వర్షాకాలం ముంచెత్తుతున్న నేపథ్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, నీరు నిలిచే సమస్యలను నివారించడం లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలందరూ తమ ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్చకుండా పరిశుభ్రత పాటించాలని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కోరారు. ఇళ్ల నుండి వచ్చే తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా ఇప్పటివరకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోని వ్యాపారులు వెంటనే లైసెన్స్ తీసుకోవాలని, లేకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, బాలే అశోక్, మెప్మా సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button