కోరుట్ల

కోరుట్లలో స్పెషల్ డ్రైవ్‌ – 40 వాహనాలు స్వాధీనం

viswatelangana.com

June 19th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్లలో పోలీసులు విస్తృతంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదాలు, నేరాల నివారణలో భాగంగా ఈ తనిఖీలు కొనసాగనున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారుల్లో పత్రాలపై అవగాహన పెంచే ఉద్దేశంతో చేపట్టిన ఈ తనిఖీలు ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్, రామచంద్రం తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button