రాయికల్
ఘనంగా వడ్డెరాజు కుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద పోచమ్మ బోనాలు

viswatelangana.com
June 19th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని వడ్డెరాజు కుల సంఘం ఆధ్వర్యంలో గురువారం పెద్ద పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఇండ్ల నుండి బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పుచప్పుళ్ల మధ్య పోతరాజుల విన్యాసాలు, యువకులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి పెద్ద పోచమ్మ కు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ… వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పశుసంపదతో పట్టణ వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ పోచమ్మకు నైవేద్యం, ఓడి బియ్యం ఆనవాయితీగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



