వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ప్రగతి విద్యార్థులు

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాల విద్యార్థులు నో బ్యాగ్ డేను మరపురానివిధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రేగుంట గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యము వృద్ధులకు ఒకపూట భోజనం వితరణతో పాటు,పండ్లు,బ్రెడ్ ప్యాకెట్లు, ఇతర ఆవశ్యక వస్తువులు అందజేశారు. విద్యార్థులు వృద్ధులతో మమేకమై మానవీయతకు ఉదాహరణగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ నో బ్యాగ్ డే అంటే కేవలం పాఠ్యపుస్తకాలు లేని రోజు మాత్రమే కాదు, జీవితాన్ని నేర్చుకునే అవకాశం కూడా. ఈ సేవా కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజంలో తమ పాత్రను గ్రహించేందుకు మేలైన అవకాశం లభించింది అని అన్నారు. వృద్ధులు విద్యార్థుల ప్రేమతో మెరసిపోతూ, వారి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేశారు. విద్యార్థుల హృదయాన్ని తాకే ఈ వినూత్న కార్యక్రమం నో బ్యాగ్ డేకు సార్థకత చేకూర్చింది. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్, ఉపాధ్యాయులు స్వామి, రమేష్, గోపాల్ రెడ్డి, రమ్య, సునీత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



