రాయికల్ మండల బీజేపీ అధ్యక్షుడు గా ఆకుల మహేష్

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీ పేట్ గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపిటిసి, పార్టీ సీనియర్ నాయకులు ఆకుల మహేష్ ను మండల అధ్యక్షుడుగా నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు నియామక పత్రాన్ని మహేష్ కు అందజేశారు. మహేష్ ప్రస్తుతం బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా, మండల పార్టీ ఇంచార్జీ గా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నాడు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఆకుల మహేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, జిల్లా సీనియర్ నాయకులు మోరపల్లి సత్యనారాయణ, నియోజక వర్గ ఇంచార్జీ భోగ శ్రావణి కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకంకు కృషి చేసిన బీజేపీ పట్టణ అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు వేణు, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా, గ్రామ గ్రామాన బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.



