రాయికల్
సన్మానం

viswatelangana.com
July 1st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మండల తాహాసిల్దార్ శ్రీరాముల నాగార్జున కు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాహాసిల్దార్ నాగార్జున విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చందనగిరి రమేష్, ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, కోశాధికారి ఎదురుగట్ల రవీందర్, కార్యవర్గ సభ్యులు కొడిమ్యాల శంకరయ్య, మండలోజీ శ్రీనివాస్, కొమురవెల్లి రాజేందర్, శ్రీపాద లక్ష్మీనారాయణ, కడార్ల చంద్రశేఖర్, ఇనుగుర్తి రవీందర్, కొడిమ్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.



