కోరుట్ల
జోగన్ పల్లి లో ఘనంగా జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలు…
గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యవసర వస్తువులు, రెయిన్ కోట్ ల పంపిణీ

viswatelangana.com
July 4th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జవ్వాడీ నర్సింగరావు గారి పుట్టిన రోజు సందర్భంగా జోగన్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో కోరుట్ల నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గ్రామపంచాయతీ లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు రేయిన్ కోట్ పంపిణీ చేశారు.. ఈకార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్, గ్రామ కమిటీ అధ్యక్షులు బిట్కు సహదేవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం గౌతమ్ రెడ్డి, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేలు రాజ్ కుమార్, గ్రామ సోషల్ మీడియా అధ్యక్షులు ఇంద్రాల అశోక్, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు….



