వెల్గటూర్
ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

viswatelangana.com
July 6th, 2025
వెల్గటూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి ని ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షులు చెన్న కుమారస్వామి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి మొకేనపెల్లి సతీష్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మాజీ ఉపప్రధానిగా దేశనికి ఎన్నో సేవలు అందించారు సమాజంలో అంటరానితనాన్ని, రూపుమాపడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేవని ఈ సంధర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు ఎనగందుల నరేష్ మండల సోషల్ కన్వీనర్ బచ్చల వినయ్ మీడియా గ్రామశాఖ అధ్యక్షులు కుశనపెల్లి అశోక్ సీనియర్ నాయకులు గజ్జెల రాజేష్, అరెల్లి మల్లేష్, కొత్తూరు భూమన్న, మేకల లక్ష్మణ్, కుశనపెల్లి రాజేందర్, యాకుబ్, పోగుల ప్రశాంత్, కుశనపెల్లి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు


