కొడిమ్యాల
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు

viswatelangana.com
July 6th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి భక్తులకు అర్చనలు హారతి తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది. ఆషాడ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాల కడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. విష్ణువు యోగనిద్రకు ఉపక్రమించి నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నాగరాజు రమేష్ పూజలు నిర్వహించారు. నిర్మాణ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.



