బ్యాంకు సేవలపై అందరికీ అవగాహన ఉండాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల లో మేడిపల్లి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోతని నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల పని తీరు భేష్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు రామ్ కుమార్ ఇట్లాంటి కార్యక్రమం తమ కాలేజీలో ఏర్పాటు చేయడం పట్ల సంతోషంగా ఉందని, విద్యార్థులకు సైబర్ నేరాలు, ఇన్సూరెన్స్ ల పట్ల అవగాహన కల్పించడం చాలా మంచి విషయమని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని అన్నారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ నవీన్ విద్యార్థులకు సైబర్ నేరాలు, ఇన్సూరెన్స్ లు, ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించారు. ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జులై 01 నుండి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని, ప్రతి గ్రామానికి ఒక బ్యాంకు బాధ్యత వహిస్తుందని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఖాతాలు లేని వారికి జన్ ధన్ ఖాతాలు తెరిపించడం, ఖాతాలున్నా వినియోగంలో లేకపోతే ఈ కేవైసీ చేయించడం, పీఎంఎస్బివై, పీఎంజేజేబివై, రూపే కార్డు ఆక్టివేషన్, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, లాంటి బ్యాంకు పథకాలు ప్రజలు చేరవేయడమని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై ఫిర్యాదు కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 లో ఫిర్యాదు చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోతని నవీన్ కుమార్, భవాని, లెక్చరర్లు లక్ష్మీ నారాయణ,మహేష్, రంజిత్,సాయి, లావణ్య, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



