కొడిమ్యాల

బురుకుంట కట్టను తెగకుండా కాపాడండి రైతుల విన్నపం

viswatelangana.com

July 10th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామం రైతులు కొండాపూర్ గ్రామ శివారులో గల బురుకుంట కట్ట కింద పొలాల రైతులు బురుకుంట చెరువును మరమత్తులు చేయాలని గురువారం రోజు ఇరిగేషన్ ఈ ఈ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. కాగా తేదీ 08.07.2025 రోజు ఎఈ ఆధ్వర్యంలో బురుకుంట కట్ట తాత్కాలిక మరమత్తు చేయగా చెరువు యొక్క మత్తడి ని అనుకోని ఉన్న సబ్బణవేణి అంజయ్య భూమిలో తాను చెరువు కట్టకు, మత్తడి కి మించి ఎత్తు మట్టి పోసినాడు అని అందువల్ల చెరువు కట్ట మధ్యలో తెగిపోయే ఆస్కారం ఉంది అని అలాగే చెరువులో సికాం భూమిలో ఎలాంటి మట్టి పోయకుండా చర్యలు తీసుకోవాలని పోసిన మట్టిని తొలగించేటట్లు చర్యలు తీసుకోవాలని చెరువు కింద తమ పొలాలు, పశువులు ఉంటాయని ఎలాంటి అపాయం జరగక ముందే తగు చర్యలు తీసుకోవాలని మా రైతులందరికి న్యాయం చేయాలని కోరుతున్నమన్నారు. వినతి పత్రం సమర్పించిన వారు రేగుల ఎల్లయ్య, దేవవ్వ, కేతమ్మ, లక్ష్మి, గంగమ్మ, మల్లేశం, సంఘ యాది,రైతులు పాల్గొన్నారు

Related Articles

Back to top button