కూల్చిన గుడిసే వాసులకు నష్టపరిహారం ఇవ్వాలి
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి అఖిలపక్ష పార్టీల నేతల డిమాండ్
viswatelangana.com
కోరుట్ల ప్రతినిధి :ప్రభుత్వ స్థలంలో గుడిసెలు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదల ఇండ్లను అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చేసిన ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అఖిలపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు.ఈనెల 16న జంబి గద్దె వద్ద జ్యోతిరావు పూలే అంబేద్కర్ నగర్ ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలు ఇండ్లను తొలగించిన, తీరును నిరసిస్తూ అఖిలపక్షాలు ప్రజా సంఘాలు అభ్యుదయ వాదులతో సోమవారం సి ప్రభాకర్ భవన్ ఆవరణలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ కోరుట్ల పట్టణ శివారులోని సర్వే నెంబర్ 922 923 లోని సుమారు 52 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్నట్టు గుర్తించిన భూ పోరాట నేతలు ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకోన్నారు ఏళ్లుగా ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న వారంతా ఒక్కటై ఇండ్ల స్థలం కోసం అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి ర్యాలీలు ధర్నాలు కలెక్టరేట్ దృష్టికి తెచ్చిన ఎలాంటి ప్రయోజనం లేదని ఆర్థిక భారం ఎగలేక 80 గుడిసెలను స్థిర నివాసాలుగా మలుచుకోగా మరికొందరు ఇటుకలతో ఓగదిని నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. లక్ష రూపాయలు అప్పు తెచ్చి నిర్మించుకున్న ఇండ్లు గత గురువారం అర్ధరాత్రి ఎలాంటి హెచ్చరికలు నోటీసు లేకుండా వందల మంది పోలీసుల బలగాలతో ప్రభుత్వ అధికారులు జెసిబి లతో ఆ ఇండ్లను కూల్చి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదలు వేసుకున్న గుడిసెలపై దౌర్జన్యకాండ ప్రదర్శిస్తుందన్నారు. కోరుట్లలో కూల్చిన ఇండ్లలో విలువైన వస్తువులు వంటగ్యాస్ సిలిండర్ సామాగ్రి కుట్టుమిషన్లు ద్వంసం అయ్యాయని, రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజాప్రతినిధులు చెరువులు కుంటలు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఏ అధికారి పట్టించుకోని దాఖలాలు లేవని ప్రభుత్వ భూమిలో నిలువ నీడ లేని పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం కబ్జా పేరుతో దమన కాండ ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగం ప్రకారం గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. నిలువ నీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పట్టాలు ఇవ్వాలని పోరాట నేతలు ఏడుగురుపైన పలు సెక్షన్ల కింద అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టారని వారిని బే షరతుగా విడుదల చేసి కేసులు కొట్టివేసి పేదలకు న్యాయం చేయాలని అన్నారు ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీ నేతలు చేన్నవిశ్వనాథం సుతారి రాములు పెటభాస్కర్ చింత భూమేశ్వర్ ఎండి చౌదరి భీమయ్య నరేందర్ సామల రాజేశం అందేవంశీకృష్ణ అందే రామయ్య ఎండి సమీర్ రామిల్ల రాంబాబు సాంబారి మహేష్ గుడిసె వాసులు తదితరులు పాల్గొన్నారు.



