మానసిక శారీరక వికాసానికి క్రీడలు దోహదపడతాయి.
viswatelangana.com
- గ్రామీణ క్రీడలను వెరికతీయడం శుభ పరిణామం.
- క్లబ్బులో జిమ్ ఏర్పాటుకు 5 లక్షల మంజూరు
- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,జడ్పీ చైర్ పర్సన్ వసంత.
మానసిక శారీరక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ మండల క్లబ్ కళ్యాణ మండపం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కబడ్డీ లో రాయికల్ జిజేసి ప్రథమ స్థానం రాయికల్ వారియర్స్ ద్వితీయ స్థానం వాలీబాల్ పోటీల్లో ధర్మాజీపేట ప్రథమ స్థానం వస్తాపూర్ ద్వితీయ స్థానం సాధించగా ప్రథమ బహుమతి 10016,ద్వితీయ బహుమతి 5016 చొప్పున నగదును ముఖ్య అతిధుల చేతులను క్రీడాకారులు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం శుభ పరిణామం అని క్రీడలు ముఖ్యంగా స్నేహభావాన్ని పెంపొందిస్తాయని,రాజకీయాలకతీతంగా మెరిట్ ప్రకారంగా ప్రత్యేక గుర్తింపుని ఇచ్చేవి కేవలం క్రీడలు మాత్రమేనని ఆయన అన్నారు. గ్రామీణ క్రీడలు ప్రోత్సహించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన అన్నారు. క్లబ్బులో శారీరక దారుధ్యాన్ని పెంచే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా జిమ్ ఏర్పాటుకు ఐదు లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.యువతను సన్మార్గంలో నడిపేవి క్రీడలు.:జడ్పీ చైర్పర్సన్ దేవ వసంతయువతను చెడు దారి పట్టకుండా సన్మార్గంలో నడిపేవి కేవలం క్రీడలు మాత్రమేనని ఓపక్క ఆధ్యాత్మికతను మరోపక్క క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా మండల క్లబ్ సభ్యులు క్రీడలను ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని ఆమె అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉన్నదని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి వల్ల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడాకారులను వెలికి తీయడం జరిగిందన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసి కొనసాగించెలా కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. ప్రయత్నించే ప్రతి వ్యక్తి విజేత నని క్రీడల్లో రాణిస్తూ మంచి గుర్తింపు పొందాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్ లు జడ్పిటిసి అశ్విని జాదవ్ తాసిల్దార్ ఖయ్యుం ఎస్సై అజయ్ గౌడ్ కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి మహేష్ గౌడ్ మహేందర్ క్లబ్ కార్యదర్శి కురుమ సుదర్శన్ రెడ్డి సంయుక్త కార్యదర్శి గట్టు రమేష్ నరసయ్య కోశాధికారి లక్ష్మీనారాయణ సాంస్కృత కార్యదర్శి వాసరి రవి క్రీడా కార్యదర్శి గంప ఆనందం మల్లారెడ్డి క్లబ్ సభ్యులు ప్రసాద్ తిరుపతిరెడ్డి ప్రభాకర్ ఇందూరి రాజు పుర్రె శ్రీనివాస్ గంగరాజం పీఈటీలు బందెల శ్రీనివాస్ రాజేందర్ సంఘమిత్ర యూత్ భీమేశ్వర యూత్ సభ్యులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



