రాయికల్

విశ్వశాంతి పాఠశాలలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు

viswatelangana.com

March 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో జాతీయ భద్రత దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహశీల్దార్ యంఏ.ఖయ్యుం గారు, స్వాతంత్ర్య సమర యోధుడు శతాధిక వయో వృద్దుడు జైన్ ఉల్ ఉద్దీన్ గారు మరియు మండల ప్రెస్ క్లబ్ JAC అధ్యక్షులు వాసరి రవి గారు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా తహశీల్దార్ గారు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత యువత చెడు మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా తమ జీవితంలో ఉన్నత మైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించే దిశగా కష్టపడాలి అని తెలియజేశారు. అనంతరం జైన్ ఉల్ ఉద్దీన్ గారు స్వాతంత్ర్య ఉద్యమంలో తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. కార్యక్రమం లో పాఠశాల చైర్మన్ శ్రీ మచ్చ గంగాధర్ విద్యార్థులను ఉద్దేశించి దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని సేఫ్టీ మరియు హైజెనిక్ మెజర్స్ కూడా పాటిస్తూ అలాగే స్టడీస్ లో రాణిస్తూ భవిష్యత్తుని ఉన్నతంగా మలుచుకోవాల్సిందిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లు మచ్చ లలిత గారు, విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button