మేడిపల్లి
భారతీయ కిసాన్ సంగ్ ఆవిర్భావ దినోత్సవం
viswatelangana.com
March 4th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజు భారతీయ కిసాన్ సంగ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భరతమాత చిత్రపటానికి పూల మాలలు వేసి భారతీయ కిసాన్ సంగ్ ఆవిర్భావ దినోత్సవ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దతోపత్ డెంగ్లి 1979 మార్చ్ నాలుగున రాజకీయాలకు అతీతంగా భారతీయ కిసాన్ సంఘమును స్థాపించారుఅని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవూరు విజయభాస్కర్, రాజేందర్రెడ్డి, బద్దం వినయ్ రెడ్డి, క్యాతం శ్రీనివాస్ రెడ్డి, చిలిమేల శంకర్, మేడిపల్లి మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.



