రాయికల్

రాయికల్ లో త్రయుంబకేశ్వర శివలింగం

viswatelangana.com

March 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణంలోని క్లబ్ సమీపంలో ఇటిక్యాల బైపాస్ రోడ్డు లో దే దివ్యమనంగా ఇటీవల బయటపడ్డ పురాతన భక్తాంజనేయ స్వామి ఆలయంలో కొలువైయున్న శ్రీ శ్రీ త్రయుంబకేశ్వర శివలింగేశ్వర స్వామి విగ్రహాన్ని చూస్తే మనసు ఆధ్యాత్మిక భక్తి భావనతో ఉప్పొంగుతుంది,కాకతీయ కాలంకు ముందు శాతవాహనుల కాలం నాటి ఆలయం పూర్తిగా శిథిలం అయ్యి, భూమిలో కురుకపొయింది, గతంలో ఈ స్థలంలో శ్రీ పద్మ దేవి పురం అనే గ్రామం ఉందని కాకతీయ కాలంలో రవికంటి లో ఉన్న ఐదు గ్రామలలో ఇది ఒకటని అంటున్నారు ఇటీవల అపరిచిత వ్యక్తులు ఆలయంలో తవ్విన తవ్వకాలలో పూర్తిగా శిథిలమైన ఆలయం బయటపడింది, ఆనాటి నుండి నేటి వరకు భక్తులు కాలనీ వాసులు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారికి నిత్యం పూజలు చేస్తున్నారు, అలాంటి పరమ పవిత్రమైన శోభాయమానంగా ఉన్న శ్రీ శ్రీ శ్రీ త్రయుంబకేశ్వర శివలింగాన్ని దర్శించుకుని భక్తజనులందరూ మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం దర్శించుకుని మహాశివుని కృపకు పత్రులు కావలసిందిగా కాగలరు

Related Articles

Back to top button