రాయికల్

దరఖాస్తుల ఆహ్వానం

viswatelangana.com

March 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ మండలంలోని ఇటిక్యాల మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. పాఠశాలలో 7 నుంచి 10 వతరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వివరించారు. March 11వ తేదీతో గడువు ముగియనుందని వివరించారు. ఏప్రిల్ 7 న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మండలంలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు వివరాలకు 9912552338 ను సంప్రదించగలరు

Related Articles

Back to top button