కోరుట్ల
కోరుట్ల నూతన ఎస్ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

viswatelangana.com
August 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంకు నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంగమల్ల శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్న సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసిన కోరుట్ల పట్టణ ఆరవ వార్డు యేకీన్ పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అనంతరం వారిని చాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యెకీన్ పూర్ మాజీ సర్పంచ్ ఉరుమడ్ల వెంకటి, కోరుట్ల నియోజకవర్గ యూత్ నాయకులు మ్యాదరి లక్ష్మణ్, కాశిరెడ్డి వెంకటరెడ్డి, కోరుట్ల మండల యూత్ ఉపాధ్యక్షులు సైదు గంగాధర్ లు పాల్గొన్నారు.



