బీడీ కార్మికులకు పెరిగిన కరువుభత్యం చెల్లించాలి

viswatelangana.com
- తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికులకు గత నెల ఏప్రిల్ నుండి పెరిగిన కరువు బత్యం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యులకు కోరారు. శనివారం రోజున సి ప్రభాకర్ భవన్లో మాట్లాడుతూ బీడీ కార్మికులకు ప్రతి సంవత్సరం కు ఒక్కసారి ఏప్రిల్ నెలలో బీడీ వర్కర్స్ యూనియన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం వినిమయ ధరల పెరుగుదల సూచిక పాయింట్ల ప్రకారం 2023 జనవరి నుండి డిసెంబర్ నెల వరకు కార్మికులకు అదనంగా కూలి పై రూపాయలు 11.30 పైసలు పెంచబడిందన్నారు. దీని ప్రకారం ఒక 1000 బీడీలకు చుట్టినందుకు కూలి 232 రూ నుండి 245 రూపాయలకు పెరిగింది అన్నారు. ఈ పెరిగిన కరువు బత్యం(వీడిఎ ) ఏప్రిల్ నెల నుండి బీడీ కార్మికులకు చెల్లించాలని కోరారు. అలాగే గత నెలలో ముగిసిన వేతన ఒప్పందం కొరకు డిమాండ్ నోటీసులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బీడీ యజమానులకు ఇచ్చినట్లు తెలిపారు ఇంతవరకు కూడా చర్చలకు పిలువ లేదన్నారు ఈనెల 15 తర్వాత సమ్మె నోటిస్ ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీడీ కార్మిక సంఘం నేతలు కొక్కుల శాంత ఎండి ముక్రం చెన్న విశ్వనాథం, ఎన్నం రాధ, బాగమ్మ, అనసూయ ఎండి ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు



