కోరుట్ల
శ్రీ సీతారామ ఆలయాన్ని సందర్శించిన జువ్వాడి నర్సింగారావు

viswatelangana.com
March 17th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్లలోని బతుకమ్మ ఘాట్ వాగు వద్ద గల శ్రీ సీతారామ ఆలయాన్ని సోమవారం రోజున కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నరసింగారావు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు దేవతల చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ తన తండ్రి అయిన జువ్వాడి రత్నాకర్ రావు హాయంలో నిధులు కేటాయించి ఆలయ అభివృద్ధికి కృషి చేశారని, అదేవిధంగా ఈ శ్రీ సీతారామ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పటికి ఉంటాయని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ మెంబర్లు, నూతన ఉత్సవ కమిటీ మెంబర్లు, పురోహితులు, ఆలయ కమిటీ మహిళా సభ్యులు పాల్గొన్నారు.



