కోరుట్ల
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో భాగంగా అర్థశాస్త్రం సహాయ ఆచార్యులు వెంకయ్య కు చిరు సన్మానం

viswatelangana.com
May 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన 2001-2004 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల కళాశాలలో ఆ సమయములో సేవలందించిన ప్రస్తుతం మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అర్థశాస్త్రం సహాయ ఆచార్యులు మరియు జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి కే. వేంకయ్యను శాలువాతో సన్మానం చేసి, మెమోంటోను అందజేశారు.



