కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావు

viswatelangana.com
తెలంగాణ ప్రజలు సుపరిపాలన కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కోరుట్ల ఎమ్మెల్యే మాత్రం ఇంకా ఫామ్ హౌజ్ భ్రమ లోనే ఉన్నారని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక పత్రిక విలేకరులతో మాట్లాడుతూ… బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనను తప్పు పట్టడాన్ని, ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయడన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ పరిపాలన అంటే ఫామ్ హౌస్ పరిపాలన అని దేశం మొత్తం విమర్శించిన విషయాన్ని కోరుట్ల ఎమ్మెల్యే మర్చిపోవద్దని హితావు చెప్పారు. బిఆర్ఎస్ పాలనలోని తెలంగాణ అప్పుల్లో మొదటి స్థానం, అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని యావత్ భారత దేశానికి తెలిసిందేనని అన్నారు. ఏరాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ లాగ అసమర్ధ, అవినీతి పరిపాలన చేయలేదని, ఇంట్లో లేదంటే ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ఉన్నారని, ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చాడా ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా, శాసనసభ్యులకు కనీస గౌరవం ఇచ్చాడా అని ప్రశ్నించారు. మీ తండ్రి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను కేసీఆర్ పార్టీ నుంచి బహిష్కరించాడని ఆ తర్వాత అదే కేసిఆర్ అధికారంలోకి వచ్చాక నీతండ్రికి శాసనసభ్యునిగా టికెట్ ఇచ్చి మళ్లీ పోటీ చేయించాడములో కేసిఆర్ మానసిక స్థితి ఏమిటో ఒక డాక్టర్ గా చెప్పగలవా సంజయ్ అని కృష్ణా రావు ప్రశ్నించారు. మీ ఇద్దరి ఫామ్ హౌస్ లు పక్కపక్కనే ఉన్నది వాస్తవమ, కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉండి పరిపాలన చేస్తున్నాడని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంను చూసి భవిష్యత్తులో తమకు పుట్టగతులు ఉండవని బిఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని అన్నారు. ఇకముందు ముఖ్యమంత్రిపై అవాకలు చవాకులు పేలితే సహించేది లేదని జువ్వాడి కృష్ణారావు ఈ సందర్బంగా కోరుట్ల ఎమ్మెల్యే ను హెచ్చరించారు.



