రాయికల్
ఫ్రీజర్ అందజేత

viswatelangana.com
September 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన బేతి బుచ్చిరెడ్డి గత నెల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆయన జ్ఞాపకార్థం కుమారులు తిరుపతి రెడ్డి,సత్యనారాయణ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి వేణు కు 55 వేల రూపాయల ఫ్రీజర్ ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి తండ్రి మరణించినప్పుడు ఫ్రీజర్ అందుబాటులో లేక ఇతర మండలం నుంచి తెప్పించడం తమను కలచివేసిందని,ఎవరైనా చనిపోతే బంధువులు,స్నేహితుల చివరి చూపు కోసం ఫ్రీజర్ తప్పనిసరి అయినందున గ్రామానికి ఫ్రీజర్ అందజేస్తున్నట్లు తెలిపారు.



